నా మాతృభాష తెలుగు, నేను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తెలుగు మాట్లాడటం, చదవడం, వ్రాయడం నేర్పుతాను.నాకు28 సంవత్సరాలు అనుభవం వుంది.నేను ఒక విద్యాసంస్థ లో పని చేసెను, ప్రస్తుతం ఇంటి నుండి చెపుతాను. విదేశాలలో ఉన్న తెలుగు వారి పిల్లలకి మాట్లాడటం నేర్పిస్తాను.ముందుగా మాట్లాడటం తరువాత వ్రాయడం చదవడం చెపుతాను.నేను వారికి రాత్రి 7 తరువాత చెపుతూవుంటాను.చాలా మందికి మాట్లాడటం వచ్చింది.వాళ్ళు మాతృదేశం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తాత, అమ్మమ్మలు, బామ్మలతో చాలాబాగామాట్లాడుతున్నారు.నేను పాఠము చెప్పినట్లుగా కాకుండా,తెలుగు లో మాట్లాడుతూ, వారిని మరలా మాట్లాడిస్తూ, మరునాడు ముందుగా దేనిగురించి చెప్పానో విద్యార్థి కి ఎంతవరకు అర్థం అయ్యిందో చూసి ఇంటిలోని ఒక వ్యక్తిగా చెప్పడం నాకు చాలా నచ్చుతుంది. అదే అందరూ చాలా ఇష్ట పడతారు.తరువాత చిన్నచిన్న పదాలు, కూరగాయలు, పువ్వులు, ఫలాలు పేర్లు చెపుతాను. తెలుగులో స్పష్టత చాలా అవసరం అది నేర్పిస్తాను.
Subjects
Telugu Beginner-Expert
Experience
No experience mentioned.
Education
Bachelor of commerce (Apr, 1987–Jun, 1990) from ANDHRA uNIVERSITY vizag.